logo
Published : 10 Aug 2022 05:35 IST

గిరిజన హక్కుల పరిరక్షణకు సహకారం

జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: గిరిజనుల అభ్యున్నతికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి కోరారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడ్డాక తొలిసారిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ ఇండోర్‌ మైదానంలో నిర్వహించిన వేడుకలను కలెక్టర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మొదట సబ్‌ కలెక్టర్‌గా రంపచోడవరం, అనంతరం పాడేరు ఐటీడీఏ పీఓగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడం వల్ల వారి నుంచి ప్రేరణ పొందానని వెల్లడించారు. ప్రకృతితో మమేకమైన వారి జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. గిరిజనుల హక్కుల సంపూర్ణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి మాట్లాడుతూ గిరిజన యువత తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు. కళలను మరచిపోవద్దని సూచించారు. ఒకరికి సాయం చేయడం ఆదివాసీల విధానమని పేర్కొన్నారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జడ్పీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ భీశెట్టి వరహా సత్యవతి, కార్పొరేటర్‌ పీలా లక్ష్మీసౌజన్య, గిరిజన సంక్షేమ, సాధికారత శాఖ అధికారి శిరీష పాల్గొని విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ వెంకటరమణ, తుమ్మపాల సర్పంచి పెంటయ్యనాయుడు పాల్గొన్నారు.

జెండా పండగకు విస్తృత ఏర్పాట్లు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ దినోత్సవ్‌లో భాగంగా 75 వసంతాల జెండా పండగను ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ క్రీడామైదానంలో నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి మంగళవారం పరిశీలించారు. డీఆర్‌ఓ వెంకటరమణ, ఆర్‌డీఓ చిన్నికృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ ధనుంజయ్‌తో కలసి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ రవి మాట్లాడుతూ పెరేడ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీలు కూర్చోడానికి గ్యాలరీతోపాటు వేడుకలను తిలకించడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శకటాల ప్రదర్శన, స్టాల్స్‌ ఏర్పాటు చర్యలపై సమీక్షించారు. మైదానంలోని గ్యాలరీకి రంగులు వేయించాలని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కనక మహలక్ష్మిని ఆదేశించారు. అనకాపల్లి జిల్లాగా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని