logo

రెండు తరగతులు.. ఆరు గదులు

ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు సమృద్ధిగానే ఉన్నాయి. పిల్లలే తగ్గిపోతున్నారు. పాఠశాల విలీనం తరువాత దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండే తరగతులు మిగిలాయి. ఒకటో తరగతిలో నలుగురు, రెండో తరగతిలో 11 మంది కలిపి 15 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ రెండు తరగతులు

Published : 10 Aug 2022 05:35 IST

రెండు తరగతులకు ఒకే చోట బోధిస్తున్న ఉపాధ్యాయిని

దేవరాపల్లి, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలలకు భవనాలు సమృద్ధిగానే ఉన్నాయి. పిల్లలే తగ్గిపోతున్నారు. పాఠశాల విలీనం తరువాత దేవరాపల్లి మండలం ఎ.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో రెండే తరగతులు మిగిలాయి. ఒకటో తరగతిలో నలుగురు, రెండో తరగతిలో 11 మంది కలిపి 15 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ రెండు తరగతులు ఒకే ఉపాధ్యాయిని ఉండటంతో ఒకే గదిలో ఆమె రెండు క్లాసులకు బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో ఐదు భవనాలు, ఆరు గదులు ఉన్నాయి. ఈ పాఠశాలను గత ఏడాది నాడు-నేడు పథకం కింద రూ. 18 లక్షల వ్యయంతో ఆధునికీకరించడం విశేషం.

నాడు-నేడులో ఆధునికీకరించిన ఎ.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని