తాళం పడిందా.. సొత్తు గోవిందా..

ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. దాన్ని చాకచక్యంగా పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారు. ఇలాంటి ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకొన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మంగాపురంకాలనీ దరి

Updated : 10 Aug 2022 06:44 IST

దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌లు

ఎం.వి.పి.కాలనీ, పెదవాల్తేరు, న్యూస్‌టుడే : ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే చాలు.. దాన్ని చాకచక్యంగా పగలగొట్టి దొంగతనానికి పాల్పడతారు. ఇలాంటి ఇద్దరు దొంగలను పోలీసులు పట్టుకొన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మంగాపురంకాలనీ దరి నివాసముంటున్న షేక్‌ పర్వీన్‌ ఈనెల 3వ తేదీన ఇంటికి తాళం వేసి పి.ఎం.పాలెంలోని పుట్టింటికి వెళ్లారు. ఈనెల 6న పర్వీన్‌ నివాసంలో అద్దెకు ఉంటున్న రామారావు ఫోన్‌చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని, వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నట్లు సమాచారం ఇవ్వటంతో వెంటనే వచ్చి పరిశీలించగా, 14 తులాల బంగారు ఆభరణాలు, 250 తులాల వెండి వస్తువులు, రెండు ల్యాప్‌టాప్‌లు కనిపించలేదు. దొంగతనం జరిగినట్లుగా గుర్తించి ఎంవీపీకాలనీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత నేరస్తుల వివరాలతో విచారణ చేపట్టారు. ఈనెల 8న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జేఆర్‌.నగర్‌ రోడ్డులో పాత నేరస్తులైన కొమ్మాదికి చెందిన మరడ సాయి(24), వేపగుంటకు చెందిన షణ్ముఖరావు(19)ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. మరడ సాయి జల్సాలకు అలవాటుపడి డబ్బులకోసం రాత్రుళ్లు తిరుగుతూ.. ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చాలు దొంగతనానికి పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. షణ్ముఖరావుతో కలిసి ఈనెల 5న అర్ధరాత్రి ఈ దొంగతనానికి పాల్పడట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి, వారి నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని