logo

ఛిద్రమై..గుంతలు పడి..

కేజీహెచ్‌ ఆవరణలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పెథాలజీ విభాగం నుంచి సూపర్‌స్పెషాల్టీ బ్లాకు, నర్సులు, మెడికోల వసతిగృహాలు, అక్కడి నుంచి అనాటమీ, ఫిజియాలజీ విభాగాలకు వెళ్లే రహదారులు ఛిద్రమయ్యాయి. ఇటీవలి వర్షాలతో ఇవి బురదమయంగా మారాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించలేక

Published : 10 Aug 2022 05:35 IST

కేజీహెచ్‌లో రోడ్ల దుస్థితి

సూపర్‌స్పెషాల్టీ విభాగానికి వెళ్లే మార్గం..

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌ ఆవరణలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పెథాలజీ విభాగం నుంచి సూపర్‌స్పెషాల్టీ బ్లాకు, నర్సులు, మెడికోల వసతిగృహాలు, అక్కడి నుంచి అనాటమీ, ఫిజియాలజీ విభాగాలకు వెళ్లే రహదారులు ఛిద్రమయ్యాయి. ఇటీవలి వర్షాలతో ఇవి బురదమయంగా మారాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించలేక మెడికోలు, రోగులు, వైద్య సిబ్బంది అవస్థలు ఆసుపత్రి ఆవరణలో సీసీ రోడ్లు వేసిన అధికారులు స్పెషాల్టీ విభాగాల వైపు వెళ్లే దారులను వదిలేశారు. గతంలో ఆయా దారులను యూజీడీ (భూగర్భ డ్రైనేజీ) పనుల కోసం తవ్వేశారు. తర్వాత వాటిని సరిగా పూడ్చకుండా వదిలేయడంతో గుంతలు పడి అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది, రోగులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని