logo
Published : 10 Aug 2022 05:35 IST

స్నేహితుడు స్పందించే.. ప్రాణాలు కాపాడే..

పోలీసులు రక్షించిన గోపాల్‌

విశాఖపట్నం, న్యూస్‌టుడే : కుటుంబ సభ్యులు దగ్గర లేకపోవటం.. తనకంటూ ఎవరూ లేరనే దిగులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి స్టేటస్‌లో పెట్టిమరీ ఆత్మహత్యాయత్నం చేయగా.. పోలీసులు రక్షించి.. కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  అనకాపల్లికి చెందిన దిలీప్‌ మంగళవారం తెల్లవారుజామున 3.26 గంటలకు డయల్‌ 100కు ఫోన్‌ చేశాడు. పితానిదిబ్బలో నివాసముంటున్న తన స్నేహితుడు ధర్మతోట గోపాల్‌.. ‘నా చావుకు నేనే బాధ్యుడిని’ అంటూ స్టేటస్‌లో ఉంచాడని.. అతన్ని వెంటనే కాపాడాలని కోరాడు. స్పందించిన కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది 2వ పట్టణ పోలీసుస్టేషన్‌ మొబైల్‌ ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న ఎ.ఎస్‌.ఐ. అప్పారావుకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన ఆయన గోపాల్‌ ఉంటున్న ప్రదేశాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. ఇంట్లోకి చూడగా గోపాల్‌ చాపపై పడుకుని ఉన్నాడు. తలుపులు గట్టిగా కొట్టగా కొంతసేపు తర్వాత తలుపులు తెరిచి బయటకు రాగా, అతని చేతిలో కత్తి ఉంది. పోలీసులు కత్తి తీసుకుని అతని వివరాలు తెలుసుకున్నారు. ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గోపాల్‌ తెలిపాడు. చదువుకున్న వారు ఇలాంటి పనులు చేయటమేంటని పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఒంటరితనాన్ని అధిగమించడానికి అనేక దారులున్నాయన్నారు. అనంతరం గోపాల్‌ స్నేహితుడు దిలీప్‌కు సమాచారం ఇవ్వటంతో అతను వచ్చి గోపాల్‌ను వెంట తీసుకువెళ్లాడు. కాకినాడకు చెందిన గోపాల్‌ సోదరి, తండ్రీ ఆత్మహత్య చేసుకున్నారని, అదే ఫోబియాతో ఉన్నట్లుగా తమకు అనిపిస్తుందని దిలీప్‌ చెప్పటంతో పోలీసులు మంచి మాటలు చెప్పి నచ్చజెప్పి పంపించారు. ఏఎస్సైని సీపీ శ్రీకాంత్‌ అభినందించారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని