logo
Published : 10 Aug 2022 05:35 IST

వైకాపా పాలనలోనే బడులకు మహర్దశ: ఎమ్మెల్యే

జానకయ్యపేటలో ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే బాబూరావు

నక్కపల్లి, ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. నక్కపల్లి మండలం జానకయ్యపేట ఉన్నత పాఠశాల, ఎస్‌.రాయవరం మండలం వమ్మవరం జడ్పీ పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వమ్మవరం పాఠశాలలో సరస్వతీదేవి, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేశారు. పాఠశాల ఆవరణలో కొబ్బరి మొక్కలు నాటారు. అనంతరం ఆజాదీకా అమృత మహోత్సవ్‌ ర్యాలీలో పాల్గొన్నారు. వమ్మవరం సర్పంచి పాలపర్తి పాపారావు, నక్కపల్లి ఎంపీడీఓ సీతారామరాజు, ఎంఈఓలు డీవీడీ ప్రసాదు, మూర్తి, ఎస్‌ఎస్‌ఈ డీఈ నారాయణరావు ఏఈలు ప్రసాద్‌ రమణాజీ, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణమ్మ, సూరిబాబు, హెచ్‌ఎం కృష్ణమోహన్‌, ఈఓఆర్డీ సత్యనారాయణ, నాయకులు గురునాథరావు, సత్తిబాబు, హనుమంతురావు, సత్తిబాబు, సందీప్‌కుమార్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని