logo

‘నూతన ఆస్తి పన్ను విధానం రద్దు చేయండి’

మూల విలువ ఆధారిత ఆస్తి పన్ను, చెత్త సేకరణ రుసుముల పేరిట అడ్డగోలు వసూళ్లకు పాల్పడటం తక్షణమే నిలిపివేయాలని విశాఖపట్నం అపార్ట్‌మెంట్స్, రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా) ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం

Published : 10 Aug 2022 05:35 IST

ఆందోళనలో పాల్గొన్న వార్వా, నివాస్‌ ప్రతినిధులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మూల విలువ ఆధారిత ఆస్తి పన్ను, చెత్త సేకరణ రుసుముల పేరిట అడ్డగోలు వసూళ్లకు పాల్పడటం తక్షణమే నిలిపివేయాలని విశాఖపట్నం అపార్ట్‌మెంట్స్, రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (వార్వా) ప్రధాన కార్యదర్శి బీబీ గణేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ నూతన ఆస్తి పన్ను విధానంపై తీర్మానం చేసే అధికారం ప్రత్యేకాధికారికి ఉండదన్నారు.

* జనవరి 31, 2021లో ఆస్తిపన్నుపై ప్రత్యేకాధికారి చేసిన తీర్మానం చెల్లుబాటు కాదని ఇప్పటి వరకు వార్వా, నివాస్‌ ఆధ్వర్యంలో హైకోర్టులో 247 పిటీషన్లు వేశామన్నారు. కోర్టు తీర్పు వచ్చేంత వరకు నూతన విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఆందోళనలో సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ గంగారావు, నివాస సంక్షేమ సంఘం నాయకులు ఎన్‌.ప్రకాశరావు, సీహెచ్‌ఎల్‌ఎన్‌ శాస్త్రి, పిట్ట నారాయణమూర్తి, జేపీ శర్మ, కేవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు