logo
Updated : 10 Aug 2022 14:00 IST

కొండను గ్రావెల్‌ క్వారీకి ఇచ్చి ప్రకృతిని నాశనం చేయొద్దు

ఆనందపురం : గ్రావెల్‌ కోసం కొండను క్వారీకి ధారాదత్తం చేసి ప్రకృతిని నాశనం చేయొద్దని తరులవాడ గ్రామస్థులు తమ అభిప్రాయాన్ని గనులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. బుధవారం గనులు, భూగర్భ మైనింగ్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంయుక్తంగా తరుడవాడ గ్రామంలో మైనింగ్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు గ్రామ సర్పంచి బాలి రాంబాబు నాయుడు మాట్లాడారు. గ్రామంలో ఉన్న కొండను గ్రావెల్‌ క్వారీకి అనుమతి ఇచ్చారన్న విషయాన్ని రెవెన్యూ అధికారులు గ్రామ సర్పంచికి  సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు కొండను ఆనుకొని వ్యవసాయం, తోటలు సాగుచేస్తున్నారన్నారు. గతంలో బంజరు భూముల అభివృద్ధి పథకం కింద 500 ఎకరాలు ఇచ్చారని, వాటిని అభివృద్ధి చేసి జీడి మామిడి పంటలను సాగుచేస్తున్నారు. అలాంటి భూములను మైనింగ్‌ కోసం తీసుకోవడం బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేయడమేనన్నారు. కొండపైన శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించి ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తున్న సమయంలో గ్రావెల్‌ క్వారీకి ఇవ్వడం బాధాకరమన్నారు. అనంతరం మాజీ సర్పంచి బాలి అయ్యప్ప మాట్లాడుతూ పంచాయతీకి క్వారీ ద్వారా ఏదో ఆదాయం వస్తుందని ఆశిస్తే గ్రామ ప్రజల భవిష్యత్‌ అంధకారమవుతుందన్నారు. మండు వేసవిలో సైతం గ్రామంలో మంచినీళ్లు దొరుకుతున్నాయంటే కొండ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి వలయమే కారణమని, దీనిని ప్రజలు, అధికారుల గ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనుల శాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని