logo

విశాఖ జిల్లా కలెక్టర్లు...124

స్వాతంత్య్రం రాక మునుపే విశాఖ జిల్లా ఏర్పడింది. బ్రిటీష్‌, డచ్‌ పాలకులు తమ అవసరాల నిమిత్తం విశాఖను వాణిజ్య కేంద్రంగా వినియోగించుకొనేవారు.

Updated : 11 Aug 2022 05:05 IST

1950లో జిల్లా జనాభా 1.05 లక్షలు..

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

 

స్వాతంత్య్రం రాక మునుపే విశాఖ జిల్లా ఏర్పడింది. బ్రిటీష్‌, డచ్‌ పాలకులు తమ అవసరాల నిమిత్తం విశాఖను వాణిజ్య కేంద్రంగా వినియోగించుకొనేవారు. అప్పటిలో జిల్లా పాలన వ్యవహారాలు విశాఖ కేంద్రంగా సాగేవి. నాడు విశాఖను వైజాగ్‌పటంగా పిలిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని అయిదు జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు విశాఖ జిల్లా పరిధిలో ఉండేవి. కాలక్రమేణ ఆయా ప్రాంతాలు విశాఖ నుంచి వీడి కొత్త జిల్లాలుగా అవతరించాయి.

* బ్రిటీషు పాలనలో జిల్లా పాలిత కేంద్రంగా విశాఖ  కొనసాగింది. జిల్లాకు 1803వ సంవత్సరం నుంచి కలెక్టర్లు సేవలు అందించారు. 124వ కలెక్టర్‌గా ఎ.మల్లికార్జున కొనసాగుతున్నారు.
* ఒడిశా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే 1936లో విశాఖ జిల్లా పరిధిలోని కటక్‌, బిసమ్‌, జైపూర్‌, కోరాపుట్‌, మల్కన్‌గిరి, నౌరంగాపూర్‌, పొట్టంగి, రాయగడ వంటి ప్రాంతాలు ఆ రాష్ట్ర పరిధిలోకి వెళ్లాయి. గంజాం జిల్లా పరిధిలోని సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాలు విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చాయి.
* స్వాతంత్య్రం తర్వాత 1950లో శ్రీకాకుళం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పాడ్డాయి. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజన కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి 11 మండలాలు, అనకాపల్లి జిల్లాలోకి 24 మండలాలు వెళ్లగా ప్రస్తుతం విశాఖ జిల్లా 11 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 25 లక్షల జనాభాతో కొనసాగుతోంది. 1048 చదరపు కిలోమీటర్ల పరిధిలో జిల్లా విస్తరించి ఉంది.

కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి 49 ఏళ్లు..
చెక్కుచెదరని కట్టడంగా కలెక్టరేట్‌ భవనం కొనసాగుతోంది. అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఆంగ్ల అక్షరం ఇ ఆకారంలో జి+1 తరహాలో భవనాన్ని నిర్మించారు. 1865లో మొదలైన ఈ భవన నిర్మాణం పూర్తి కావడానికి 49 ఏళ్లు పట్టింది. 1914 ఆగస్టు 15న కలెక్టరేట్‌ భవనం ప్రారంభమైంది. గ్యానన్‌ అండ్‌ డంకర్లరీ సంస్థ నిర్మించింది. పూర్తి రాతికట్టడంతో నిర్మించిన ఈ భవనానికి బర్మా నుంచి రప్పించిన కర్రను వినియోగించారు. పైకప్పునకు బంగ్లా పెంకులను వాడారు. భారత ప్రభుత్వ పురావస్తుశాఖ ఈ భవనాన్ని పురాతన కట్టడంగా గుర్తించింది. స్వాతంత్య్రం రాక ముందు నుంచే ఇక్కడ కలెక్టరేట్‌ కొనసాగేది.
జిల్లా జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు అధికంగా ఉండడంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి అనేక మంది వలస వస్తూ విశాఖలో స్థిరపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అంటే 1950లో జిల్లా జనాభా 1,05,000 మంది ఉంటే 2022 నాటికి 22.78లక్షలకు చేరింది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా వివరాలను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలో పెరుగుదల ఇలా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు