logo

కలకాలం..గుండె గుడిలో !!

మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతలు తగ్గిపోతున్న నేటి రోజుల్లో తమ సోదరి ఈ లోకాన్ని విడిచివెళ్లినా... గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తూ అనుబంధానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు పెదగంట్యాడ వెంకన్నపాలేనికి చెందిన సోదరులు.ఏటా రక్షాబంధన్‌ (రాఖీ) వేడుకకు

Published : 12 Aug 2022 05:50 IST

మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతలు తగ్గిపోతున్న నేటి రోజుల్లో తమ సోదరి ఈ లోకాన్ని విడిచివెళ్లినా... గుండెల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తూ అనుబంధానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు పెదగంట్యాడ వెంకన్నపాలేనికి చెందిన సోదరులు.
ఏటా రక్షాబంధన్‌ (రాఖీ) వేడుకకు తమ చెల్లికి నిండు మనస్సుతో ఆత్మీయ ఆశీస్సులు అందిస్తుంటారు ఈ సోదరులు. భౌతికంగా తమ మధ్య లేకపోయినా విగ్రహాలు ప్రతిష్ఠించి అనురాగ బంధాన్ని చాటుతున్నారు.
*పెదగంట్యాడ సమీప వెంకన్నపాలేనికి చెందిన గాజువాక వర్తక సంఘం అధ్యక్షులుగా పనిచేసిన, దివంగత తిప్పల చినఅప్పారావు, అరుణ దంపతులకు తిప్పల నితేష్‌, ఆదిలక్ష్మి సతీష్‌రెడ్డి సంతానం. కుమార్తెకు 1999లో రాజమహేంద్రవరం సమీప బొమ్మూరుకు చెందిన వ్యక్తితో వైభవంగా వివాహం చేయగా.. ఆ తర్వాత ఏడాదికే ఆదిలక్ష్మి మృతి చెందారు. ఈ పరిణామం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆమె జ్ఞాపకార్థం వెంకన్నపాలెం గ్రామ కూడలిలోని కల్యాణ మండపం వద్ద ఆదిలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంటి ఆవరణలోనూ మందిరం ఏర్పాటు చేసి 10 కిలోల వెండితో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి,  నిత్యం పూజలు చేస్తుంటారు. చినఅప్పారావు రెండేళ్ల క్రితం మృతి చెందారు. నేటికీ సోదరి స్మృత్యార్థం ఆమె పుట్టిన రోజు సెప్టెంబరు 11, మరణించిన రోజు మార్చి 8వ తేదీతో పాటు రాఖీ పౌర్ణమి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోదరులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని