logo

తాత్కాలిక నియామకాలపై ఆర్జేసీ విచారణ

విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారిగా, ఎర్నిమాంబ ఆలయ ఈవోగా కె.శాంతి ఉన్న సమయంలో జరిగిన ఇద్దరు ఉద్యోగుల నియామకాలపై దేవాదాయశాఖ ఆర్జేసీ సురేష్‌బాబు ఇటీవల విచారణ జరిపారు.

Published : 12 Aug 2022 05:50 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా దేవాదాయశాఖ అధికారిగా, ఎర్నిమాంబ ఆలయ ఈవోగా కె.శాంతి ఉన్న సమయంలో జరిగిన ఇద్దరు ఉద్యోగుల నియామకాలపై దేవాదాయశాఖ ఆర్జేసీ సురేష్‌బాబు ఇటీవల విచారణ జరిపారు. శాంతి ఎర్నిమాంబ ఆలయ ఈవోగా ఉన్న సమయంలో వీరిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. అప్పటి వరకు ఆలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని తొలగించారు. ఆయా అంశాలపై తాజాగా దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. వాటి ఆధారంగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆర్జేసీని ఆదేశించడంతో ఈనెల 8న విశాఖ వచ్చిన ఆర్జేసీ విచారణ జరిపారు. ఎర్నిమాంబ ఆలయ ప్రస్తుత ఈవో సురేష్‌బాబాను పిలిచి మాట్లాడారు. అప్పట్లో నియమితులైన వారి విషయంలో అనుసరించిన పద్ధతులపై ఆరా తీశారు. శాంతి బదిలీ తర్వాత తాత్కాలిక నియామకం పొందిన వారిద్దరినీ ప్రస్తుత అధికారులు విధుల నుంచి తొలగించారు. ఫిర్యాదు చేసిన వారితో ఆర్జేసీ మాట్లాడారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. శాంతి విశాఖ నుంచి బదిలీ అయి వెళ్లిన తర్వాత నాటి వివాదాస్పద నిర్ణయాలపై విచారణ జరగడం దేవాదాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని