logo

‘జగనన్న విద్యాదీవెన’ నిధులు విడుదల

జగనన్న విద్యాదీవెన చెక్కును కలెక్టరు డాక్టర్‌ మల్లికార్జున గురువారం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విడుదల చేశారు.

Published : 12 Aug 2022 06:01 IST

జగనన్న విద్యాదీవెన చెక్కును అందజేస్తున్న కలెక్టరు డాక్టర్‌ మల్లికార్జున, తదితరులు

కంచరపాలెం, న్యూస్‌టుడే: జగనన్న విద్యాదీవెన చెక్కును కలెక్టరు డాక్టర్‌ మల్లికార్జున గురువారం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో విడుదల చేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న విద్యాదీవెన పథకం నిధుల విడుదల బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని కలెక్టరు మల్లికార్జున, నెడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కె.కె.రాజు కళాశాలలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం అర్హులైన విద్యార్థులకు రూ.4.67 కోట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరు రమణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి అఖిల, డిప్యూటీ మేయరు కె.సతీష్‌, ప్రిన్సిపల్‌ జి.ఎస్‌.ఎన్‌.మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts