logo

అనాటమీ విభాగానికి మృతదేహం అప్పగింత

అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందిన రచయిత రమణీమణి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆంధ్ర వైద్యకళాశాల అనాటమీ విభాగానికి గురువారం అప్పగించారు

Published : 12 Aug 2022 06:07 IST

రమణీమణి (పాతచిత్రం)

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందిన రచయిత రమణీమణి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం ఆంధ్ర వైద్యకళాశాల అనాటమీ విభాగానికి గురువారం అప్పగించారు. శరీర అవయవదాతల సంఘం ప్రతినిధి గూడూరు సీతామహలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది. కార్నియాను ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రికి అప్పగించారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్న సమయంలోనే.. మరణానంతరం తన పార్థివ దేహాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారని రమణీమణి భర్త అర్నాద్‌ తెలిపారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రవీంద్ర విశాఖలో ఉండగా, రెండో కొడుకు నవీన్‌ అమెరికాలో ఉంటున్నారని ఆయన శనివారం విశాఖ వస్తారని చెప్పారు. అర్నాద్‌ కుటుంబసభ్యులంతా దేహదాన సభ్యులు కావడం అభినందనీయమని సీతామహలక్ష్మి పేర్కొన్నారు. ఈమె మృతికి రచయితలంతా సంతాపం తెలియజేస్తున్నారని, వారి సన్నిహితుడు మేడా మస్తాన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని