logo

బ్యాలెట్‌ పేపర్‌ ద్వారానే ఎన్నిక

రాంబిల్లి మండల పరిధిలోని వాడనరసాపురం మత్స్యకార సహకార సంఘం కార్య నిర్వహణ కమిటీ ఎన్నికను చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తామంటూ ఎన్నికల అధికారి పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రహస్య బ్యాలెట్‌ ప్రక్రియతో ఎన్నిక నిర్వహించాలని తేల్చిచెప్పింది.

Updated : 12 Aug 2022 06:46 IST

హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: రాంబిల్లి మండల పరిధిలోని వాడనరసాపురం మత్స్యకార సహకార సంఘం కార్య నిర్వహణ కమిటీ ఎన్నికను చేతులెత్తడం ద్వారా నిర్వహిస్తామంటూ ఎన్నికల అధికారి పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. రహస్య బ్యాలెట్‌ ప్రక్రియతో ఎన్నిక నిర్వహించాలని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఈనెల 13న వాడనరసాపురం మత్స్యకారుల సహకారం సంఘానికి ఎన్నికల నిర్వహణకు అధికారి నోటిఫికేషన్‌ జారీచేశారని, చేతులెత్తడం ద్వారా ఎన్నిక నిర్వహిస్తామని అందులో పేర్కొన్నారంటూ వాడనరసాపురం గ్రామానికి చెందిన సీహెచ్‌ ఆనందరావు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సంఘ సభ్యులు 50కి మించి ఉంటే బ్యాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. పిటిషనర్ల సంఘంలో 540 మంది సభ్యులున్న నేపథ్యంలో ఎన్నికను బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని