logo

Vizag steel: విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ.. కేంద్రం మరో ఎత్తుగడ: బీవీ రాఘవులు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

Published : 12 Aug 2022 13:54 IST

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఉత్పత్తిని తగ్గించి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోందని విమర్శించారు. 24వేల టన్నుల ఉత్పత్తికి గాను కేవలం 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని వెల్లడించారు. 

అంతర్జాతీయంగా బొగ్గు ధర పడిపోయిందన్నారు. భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాసి, ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన మినీ మహానాడులో, వైకాపా ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు చేయలేదని రాఘవులు ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని