logo

16న అచ్యుతాపురానికి సీఎం రాక

వైకాపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఒకొహామా గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలో ఆయన శుక్రవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మతో కలిసి పర్యటించారు. ఈనెల 16న ముఖ్యమంత్రి జగన్‌ ఈ పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభిస్తారన్నారు. దీంతో పాటు మరో 8 పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేస్తారన్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, ముఖ్యమంత్రి కాన్వాయ్‌ తదితర అంశాలపై

Published : 13 Aug 2022 04:35 IST

ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవం.. మరో 8 పరిశ్రమలకు భూమిపూజ

ఏర్పాట్లపై సమీక్షిస్తున్న మంత్రి అమర్‌, ఎమ్మెల్యే కన్నబాబురాజు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ఒకొహామా గ్రూపునకు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలో ఆయన శుక్రవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సుకుమార్‌వర్మతో కలిసి పర్యటించారు. ఈనెల 16న ముఖ్యమంత్రి జగన్‌ ఈ పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభిస్తారన్నారు. దీంతో పాటు మరో 8 పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేస్తారన్నారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌, ముఖ్యమంత్రి కాన్వాయ్‌ తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 120 దేశాలకు టైర్లను ఎగుమతి చేసే పరిశ్రమ ఇక్కడ ఏర్పాటుకావడం గొప్ప విషయమన్నారు. వంద ఎకరాల్లో రూ.1500 కోట్లతో పరిశ్రమ ఏర్పడిందని, 200 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత స్థలం కేటాయించి, నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.  

స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించి

తీరుతాం : స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించడం అనేది సరదాగా చెప్పిన అంశం కాదని అమర్‌నాథ్‌ అన్నారు. ఉపాధిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో ఏర్పాటుచేసిన అపాచీ కంపెనీలో 10 వేల మందికి ఉపాధి కల్పించగా వారిలో 79 శాతం మంది స్థానికులే అన్నారు. ఏటీజీ పరిశ్రమలోనూ కశింకోట ఆర్‌ఈసీఎస్‌ పాలిటెక్నిక్‌లో చదువుకున్న 49 మంది డిప్లమో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ప్రస్తుతం 69 శాతం ఉపాధి స్థానికులకే కల్పించామని మంత్రి ప్రకటించారు. మార్టూరుకు చెందిన భూముల్లో పరిశ్రమను ఏర్పాటుచేసి గ్రామస్థులకు ఉపాధి కల్పించడానికి కంపెనీ ముందుకు రాలేదని అచ్యుతాపురం వైస్‌ ఎంపీపీ అల్లంపల్లి లక్ష్మి, మార్టూరు సర్పంచి కేకేవీ సీతారామరాజు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కళాసీ, హౌస్‌కీపింగ్‌ పనులు అందించి స్థానికులకు ఉపాధి కల్పించామని కంపెనీ ప్రతినిధులు మోసగిస్తున్నారని వైకాపాకు చెందిన దిబ్బపాలెం సెజ్‌ కాలనీని అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బైలపూడి రాందాసు మంత్రి వద్ద విచారం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ సభ్యులు లాలం రాంబాబు, నర్మాలకుమార్‌, వైకాపా నాయకులు కోన బుజ్జి, దేశంశెట్టి శంకరరావు, వెంకునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని