logo

తండ్రికి ఉద్యోగం.. కొడుక్కి రాష్ట్రస్థాయి ర్యాంకు

ఎ.కోడూరు శివారు పొడుగుపాలెంకు చెందిన వంటాకు రోహిత్‌ శుక్రవారం తెలంగాణ ఎంసెట్‌లో (అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం) రెండో ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థికి 200కి 153 మార్కులు వచ్చాయి. ఇతని తండ్రి గౌరునాయుడు, తల్లి దేముడమ్మ వ్యవసాయం చేస్తుంటారు. గౌరునాయుడు ఎంఎస్సీ,

Published : 13 Aug 2022 04:35 IST

తెలంగాణ ఎంసెట్‌లో పొడుగుపాలెం విద్యార్థి ప్రతిభ

రోహిత్‌కు స్వీటు తినిపిస్తున్న తల్లిదండ్రులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఎ.కోడూరు శివారు పొడుగుపాలెంకు చెందిన వంటాకు రోహిత్‌ శుక్రవారం తెలంగాణ ఎంసెట్‌లో (అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగం) రెండో ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థికి 200కి 153 మార్కులు వచ్చాయి. ఇతని తండ్రి గౌరునాయుడు, తల్లి దేముడమ్మ వ్యవసాయం చేస్తుంటారు. గౌరునాయుడు ఎంఎస్సీ, ఎంఈడీ చదువుకుని ప్రైవేటు ఉద్యోగం, వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 98 డీఎస్‌సీలో క్వాలిఫై అవడంతో ఇటీవలే ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ కుటుంబంలో ఈ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ.. ఆయన కుమారుడు రోహిత్‌ తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి ఒకటి నుంచి పదో తరగతి వరకు నర్సీపట్నంలో, ఇంటర్‌ బైపీసీ రాజమహేంద్రవరంలో పూర్తి చేశాడు. రోహిత్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ర్యాంకు సాధించడం ద్వారా తల్లిదండ్రుల ఆశను నెరవేర్చానన్న ఆనందం దక్కిందన్నాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని