logo

ఇక్కడ ఏడు.. అక్కడ ఒకటి

కృషి.. పట్టుదల.. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన కుర్రాడు కురచా హేమంత్‌ కుమార్‌. శుక్రవారం విడుదలైన తెలంగాణ ఈసెట్‌ ఫలితాల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 148 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. హేమంత్‌

Published : 13 Aug 2022 04:35 IST

తెలంగాణ ఈసెట్‌లో అప్పలరాజుపురం కుర్రాడి సత్తా

హేమంత్‌కి మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు మోదినాయుడు, భవాని

చీడికాడ, న్యూస్‌టుడే: కృషి.. పట్టుదల.. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన కుర్రాడు కురచా హేమంత్‌ కుమార్‌. శుక్రవారం విడుదలైన తెలంగాణ ఈసెట్‌ ఫలితాల్లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 148 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. హేమంత్‌ ఈనెల 10న విడుదలైన ఏపీ ఈసెట్‌లో ఏడో ర్యాంకు సాధించడం విశేషం. ఈ విద్యార్థి కన్నవారు కురచా మోదినాయుడు, భవాని సాధారణ వ్యవసాయదారులు. గ్రామంలో వ్యవసాయం చేస్తుంటారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హేమంత్‌. రెండో కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించాలన్నదే ఈ కర్షకుల కల. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగానే పిల్లలిద్దరూ చదువులో రాణిస్తున్నారు.

విద్యాభ్యాసం అంతా.. సర్కారు బడిలోనే.. :  హేమంత్‌ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ    పాఠశాలలోనే సాగింది. ఆరు, ఏడో తరగతులు చీడికాడ మండలం అప్పలరాజుపురం ఉన్నత పాఠశాలలో.. 8, 9, 10 తరగతులు ఏపీ ఆదర్శ పాఠశాలలో చదివాడు. పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు రావడంతో విశాఖ ప్రభుత్వ కెమికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లమో పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన  ఏపీ ఈసెట్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఏడో ర్యాంకు, తాజాగా విడుదలైన తెలంగాణ ఈసెట్‌ ఫలితాల్లో మొదటి ర్యాంకు సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని