logo

చేసిందే ప్రజలకు ధైర్యంగా చెబుతున్నాం

తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ధైర్యంగా చెప్పే అవకాశాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని, అందుకే ప్రతి ఇంటికి వెళ్లి పలకరించగలుగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. రైవాడ శివారు శ్రీరాంపురం, శంభువానిపాలెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గడపగడపకు మన

Published : 13 Aug 2022 04:35 IST

రాఖీ కట్టిన రైవాడ సచివాలయ మహిళా ఉద్యోగులను ఆశీర్వదిస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు ధైర్యంగా చెప్పే అవకాశాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారని, అందుకే ప్రతి ఇంటికి వెళ్లి పలకరించగలుగుతున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. రైవాడ శివారు శ్రీరాంపురం, శంభువానిపాలెం గ్రామాల్లో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు తమ ప్రభుత్వం ద్వారా అందిన పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరిన ఆర్థిక లబ్ధికి సంబంధించిన పత్రాల సంపుటిని అందజేశారు. శ్రీరాంపురంలో ఈశ్వర డ్వాక్రా సంఘానికి రుణ మాఫీ కాలేదని డ్వాక్రా మహిళలు అడగ్గా, వెంటనే అక్కడే ఉన్న వెలుగు ఏపీఎం ప్రభాకర్‌ని పిలిపించి దీనిపై ప్రశ్నించారు. శ్రీరాంపురంలో రోడ్డు మధ్యలో అడ్డదిడ్డంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను పక్కకు మార్చాలని ఏఈఈ శంకరరావును ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలకు వెళ్లి పిల్లలతో కాసేపు మాట్లాడారు. శుక్రవారం రాఖీ పండగ కావడంతో అనేకమంది మహిళలు ముత్యాలనాయుడుకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, సర్పంచి చల్లా లక్ష్మి, ఉప ఎంపీపీ ఉర్రూకల గంగాభవాని, మాజీ ఎంపీపీ భాస్కరరావు, మండల వైకాపా అధ్యక్షుడు బాబూరావు, మాజీ సర్పంచి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు.  

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని ముత్యాలనాయుడు హితవు పలికారు. రైవాడ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల వైరల్‌ అయిన ఎంపీ మాధవ్‌ వీడియో అసలుది కాదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పష్టం చేసినా, తెదేపా నాయకులు ఇంకా వైకాపా నాయకులపై బురదజల్లే ప్రయత్నం కొనసాగించడం సిగ్గుచేటన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని