logo

ఆ డ్రామాలు కొత్తేంకాదు: ధర్మశ్రీ

తెదేపా నాయకులకు డ్రామాలు ఆడటం కొత్తకాదని విప్‌, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. శుక్రవారం చోడవరం వైకాపా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు వీడియోలు మార్ఫింగ్‌ చేయడంతోపాటు పెయిడ్‌ ఆర్టిస్టులతో ఒప్పందం కుదుర్చుకొని వైకాపాపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు బురదజల్లుడు కార్యక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ఎంపీ

Published : 13 Aug 2022 04:35 IST

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా నాయకులకు డ్రామాలు ఆడటం కొత్తకాదని విప్‌, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. శుక్రవారం చోడవరం వైకాపా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు వీడియోలు మార్ఫింగ్‌ చేయడంతోపాటు పెయిడ్‌ ఆర్టిస్టులతో ఒప్పందం కుదుర్చుకొని వైకాపాపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు బురదజల్లుడు కార్యక్రమాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో బ్రిటన్‌లో ఒక ఫోన్‌ నుంచి టీడీపీ సైట్‌లో పోస్టు చేశారని ఇప్పటికే ఎస్పీ స్పష్టం చేశారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ కలిపి పన్నిన కుట్రలో ఇది భాగమని ఆరోపించారు. ప్రజాదరణ పొందుతున్న సీఎం జగన్‌పై బురద జల్లుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేందుకు తెదేపా చేస్తున్న దుష్ప్రచారంలో ఇదో భాగమన్నారు. రాజకీయంగా వైకాపా పలుకుబడి తగ్గించడానికే తెదేపా వారే ఈ వీడియోని అప్‌లోడ్‌ చేశారన్నారు. రాయపురాజుపేట మాజీ జడ్పీటీసీ సభ్యులు బొడేడ్డ సూర్యనారాయణ, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని