logo

రాఖీ కట్టడానికి వెళుతున్న మహిళ మృత్యువాత

సోదరునికి రాఖీ కట్టడానికి వెళ్తూ ఓ వివాహిత మృతిచెందింది. దీంతో కేంద్రకారాగారం ఎదురుగా ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌లో పండగ పూట ఆ ఇంట్లో విషాదం చోటుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ సీఐ ఇమ్మానుయేల్‌ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌కు చెందిన బండారు పుష్పలత (28)

Published : 13 Aug 2022 04:35 IST

లారీ ఢీకొనడంతో కూతురికీ స్వల్ప గాయాలు

పుష్పలత (పాతచిత్రం)

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: సోదరునికి రాఖీ కట్టడానికి వెళ్తూ ఓ వివాహిత మృతిచెందింది. దీంతో కేంద్రకారాగారం ఎదురుగా ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌లో పండగ పూట ఆ ఇంట్లో విషాదం చోటుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ సీఐ ఇమ్మానుయేల్‌ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌ఎస్‌ఎన్‌ నగర్‌కు చెందిన బండారు పుష్పలత (28) మారికవలసలో తన సోదరునికి రాఖీ కడదామని ఏడాది వయసు గల కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళుతోంది. సరిగ్గా పాతడెయిరీఫారం కూడలి వద్దకు వచ్చే సరికి సిగ్నల్‌ పడగా వాహనం ఆపింది. వెనుక వస్తున్న లారీ ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయింది. తల రోడ్డుకు తగలటంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే దగ్గరలోని విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. పాప మాత్రం స్వల్పగాయాలతో బయటపడింది. దీంతో భర్త శ్రీనివాస్‌, మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసామని, మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని