logo

‘సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయండి’

విశాఖ ఉక్కు పరిరక్షణకు నిర్వహించ తలపెట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు. స్టీల్‌ సిటూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 14వ తేదీ ఉదయం

Published : 13 Aug 2022 04:35 IST

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఉక్కు పోరాట కమిటీ నాయకులు

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు పరిరక్షణకు నిర్వహించ తలపెట్టిన 36 గంటల సత్యాగ్రహ దీక్షను జయప్రదం చేయాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, ఎన్‌.రామారావు పిలుపునిచ్చారు. స్టీల్‌ సిటూ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూర్మన్నపాలెం కూడలిలోని శిబిరంలో దీక్ష జరుగుతుందన్నారు. ఉక్కు శాశ్వత, ఒప్పంద కార్మికులు, నిర్వాసితులంతా పాల్గొనాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కర్మాగారం సెంట్రల్‌ స్టోర్స్‌ కూడలిలో దీక్షకు సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. కార్మిక నాయకులు కె.సత్యనారాయణ, ఎన్‌.రామచంద్రరావు, మస్తానప్ప, రామ్మోహన్‌కుమార్‌, వి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్‌, జె.రామకృష్ణ, వి.ప్రసాద్‌, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని