logo

రిమాండ్‌ ఖైదీపై ఏఎస్‌ఐ దాడి

విచారణకు న్యాయస్థానానికి హాజరైన రిమాండ్‌ ఖైదీపై దాడి చేసిన ఏఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని, నిందితునికి చికిత్స అందించాలని ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం న్యాయమూర్తి యుగంధర్‌ ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్‌

Published : 13 Aug 2022 04:35 IST

కేసు నమోదుకు న్యాయమూర్తి ఆదేశం

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: విచారణకు న్యాయస్థానానికి హాజరైన రిమాండ్‌ ఖైదీపై దాడి చేసిన ఏఎస్‌ఐపై కేసు నమోదు చేయాలని, నిందితునికి చికిత్స అందించాలని ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానం న్యాయమూర్తి యుగంధర్‌ ఆదేశించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్‌ ప్రాంతానికి చెందిన జి.ధనేష్‌ భార్యను వేధించిన కేసులో రిమాండ్‌లో ఉన్నారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుడ్ని శుక్రవారం ఒకటో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానానికి తీసుకొచ్చారు. అతన్ని చూడటానికి తల్లిదండ్రులు, సోదరి వచ్చారు. నిందితుడు తల్లితో మాట్లాడటానికి ప్రయత్నించగా ఏఎస్‌ఐ వారించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఏఎస్‌ఐ ధనేష్‌ను కొట్టి గాయపరిచాడు. ఈ మేరకు నిందితుడు న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి ఫిర్యాదు చేశాడు. పరిశీలించిన న్యాయమూర్తి సంబంధిత పోలీసు అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, నిందితునికి వైద్య సహాయం అందించాలని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ సీఐ వెంకటరావును ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని