logo

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

సాగర్‌నగర్‌లో ఓ మహిళ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘనకు సంబంధించి ఆరిలోవ సీఐ ఇమ్మానుయేల్‌ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం భర్త శ్రీనివాస్‌ పిల్లల్ని పాఠశాలలో దింపి రావటానికి వెళ్లగా సాగర్‌నగర్‌ హెచ్‌ఐజీ 1 ఇంటినెంబర్‌ 46లో నివాసం

Published : 13 Aug 2022 04:35 IST

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: సాగర్‌నగర్‌లో ఓ మహిళ ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘనకు సంబంధించి ఆరిలోవ సీఐ ఇమ్మానుయేల్‌ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం భర్త శ్రీనివాస్‌ పిల్లల్ని పాఠశాలలో దింపి రావటానికి వెళ్లగా సాగర్‌నగర్‌ హెచ్‌ఐజీ 1 ఇంటినెంబర్‌ 46లో నివాసం ఉంటున్న వై.మల్లిక (42) ఉదయం 8.15 ప్రాంతంలో ఫ్యానుకు చున్నీతో ఆత్మహత్య చేసుకుంది. బయటనుంచి వచ్చిన భర్త గుర్తించి వెంటనే కిందకి దింపి కొన ఊపిరితో ఉన్న మల్లికను అంబులెన్స్‌లో సెవెన్‌హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 9.15 ప్రాంతంలో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్లిక గీతం కళాశాలలో కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు విచారిస్తున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని