logo

16న ముఖ్యమంత్రి పర్యటన ఇలా..

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో ఏర్పాటు చేసిన  జపాన్‌ యొకహామా గ్రూప్‌నకు చెందిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీ ప్రారంభోత్సవానికి మంగళవారం వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వివరాలను అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు.

Published : 14 Aug 2022 06:01 IST


సెజ్‌లో అండర్‌పాస్‌ గోడలకు సున్నాలు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థికమండలిలో ఏర్పాటు చేసిన  జపాన్‌ యొకహామా గ్రూప్‌నకు చెందిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీ ప్రారంభోత్సవానికి మంగళవారం వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన వివరాలను అధికారులు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అచ్యుతాపురం ఏటీజీ టైర్ల కంపెనీకి  10.40గంటలకు చేరుకుంటారు. 15 నిమిషాలపాటు స్థానిక నాయకులతో సమావేశం అనంతరం టైర్ల కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 12.35 గంటల వరకు కంపెనీలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 12.40 గంటలకు కంపెనీ ఆవరణ నుంచి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రాయానికి బయలుదేరి అక్కడ నుంచి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ ఇంటికి వెళ్లి నూతన వధూవరులను సీఎం ఆశ్వీరదిస్తారని అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద 1.10 నుంచి 1.25 గంటలవరకు ఉండి అక్కడి నుంచి మళ్లీ తిరుగు ప్రయాణమవుతారని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి ఏపీఐఐసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్లుగా నిర్వహణ లోపంతో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. బ్రాండిక్స్‌ నుంచి ఏషియన్‌ పెయింట్స్‌ వరకు ఉన్న అండర్‌ పాస్‌ రోడ్డు గోడలకు సున్నాలు వేయడంతోపాటు ఈరోడ్డులో పేరుకుపోయిన తుప్పలను పొక్లెయిన్‌తో తొలగిస్తున్నారు. సెజ్‌ రోడ్డులపై వచ్చిన బురద, మట్టిని బ్లేడ్‌ ట్రాక్టర్లు ఏర్పాటుచేసి తీయిస్తున్నారు.

ఏర్పాట్లపై సూచనలిస్తున్న అదనపు ఎస్పీ శ్రీకాంత్‌  
ఏఎస్పీ సమీక్ష : ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లుపై జిల్లా అదనపు ఎస్పీ శ్రీకాంత్‌ సమీక్షించారు.. అచ్యుతాపురం సెజ్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించే ఏటీజీ టైర్ల తయారీ పరిశ్రమలో పర్యటించారు. హెలిప్యాడ్‌ నిర్మాణం, అక్కడి నుంచి సీఎం వాహనంలో కంపెనీ వరకు వచ్చే రహదారిని పరిశీలించారు. సీఎం సభాప్రాంగణం, సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, వీఐపీల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై ఉపేంద్ర ఆయన వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని