logo

నేటి నుంచి ‘అగ్నివీర్‌’ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

ఈనెల 14 నుంచి 31 వరకు జరిగే ‘అగ్నివీర్‌’ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Published : 14 Aug 2022 06:01 IST

న్యూస్‌టుడే, ఎం.వి.పి.కాలనీ, జ్ఞానాపురం


శనివారం రాత్రి స్టేడియం వద్దకు వచ్చిన అభ్యర్థులు

ఈనెల 14 నుంచి 31 వరకు జరిగే ‘అగ్నివీర్‌’ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందిరాప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో జరిగే ఈ ఎంపికల్లో నిత్యం సుమారు 3వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో స్టేడియంకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.

* స్టేడియంకు వెళ్లే ప్రధానమార్గమైన రామకృష్ణా కూడలి నుంచి సీహార్స్‌ కూడలి వరకు ఒక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ మార్గంలో బారికేడ్లు నిర్మించారు. అభ్యర్థులను ఈ వీటి మధ్య నుంచి స్టేడియంలోకి పంపించనున్నారు. ఒకే మార్గంలో ఇరువైపులా ప్రయాణించేందుకు వీలుగా వన్‌వేను.. టూవేగా మార్చి మధ్యలో ప్లాస్టిక్‌ బిన్‌లతో డివైడర్‌గా మార్చారు. ఇక్కడ సుమారు 500 మంది  పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.  పరిసర మార్గాల్లో కూడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్మీ సిబ్బందికి నగర పోలీసులు సహకరించనున్నారు. స్టేడియంను ఆర్మీ సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎంపిక ప్రక్రియలన్నీ స్టేడియం లోపలే నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని