logo

నిత్యం.. వివాదాల మయం..

జిల్లా దేవాదాయశాఖలో పని చేసిన పూర్వ సహాయ కమిషనర్‌ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. బదిలీపై ఎన్టీఆర్‌ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు

Updated : 15 Aug 2022 06:14 IST

బదిలీపై వెళ్లినా ఏసీ శాంతిని వీడని విచారణలు

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

జిల్లా దేవాదాయశాఖలో పని చేసిన పూర్వ సహాయ కమిషనర్‌ కె.శాంతి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.

బదిలీపై ఎన్టీఆర్‌ జిల్లాకు వెళ్లినప్పటికీ ఆమెను వివాదాలు వీడడం లేదు. ఏదో ఒక విధంగా విశాఖ రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఇక్కడి నుంచి అంతే వేగంగా ఆమెపై దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళుతున్నాయి. వాటిపై ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల విశాలక్షినగర్‌లోని తన నివాసం వద్ద జరిగిన గొడవలో తాజాగా ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. పోలీసు కేసు నమోదైన నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు 16, 17 తేదీల్లో వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 

నాడు ఇసుక చల్లి: జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌గా 2020 మే నెలలో శాంతి నియమితులయ్యారు. ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఇక్కడ సేవలందించారు. 25నెలల పాటు జిల్లాలో పనిచేసిన ఆమె పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. అప్పటి ఉప కమిషనర్‌ పుష్పవర్ధన్‌పై ఇసుక చల్లి కొత్త వివాదానికి తెరలేపారు. వైకాపాకు చెందిన ముఖ్య నేత అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డీసీ క్యాడర్‌లో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ (ఇన్‌ఛార్జి)గా నాలుగు నెలల పాటు పనిచేశారు. సూపరింటెండెంట్‌ క్యాడర్‌ స్థాయి ఆలయమైన ఎర్నిమాంబ ఆలయ ఈఓగా ఏడాదికిపైగా సేవలందించారు. ఈ ఆలయంలో ముగ్గురు ఉద్యోగులను అనధికారికంగా నియమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె బదిలీ తర్వాత ఆయా నియామకాలను రద్దు చేశారు. నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై తాజాగా ఆర్జేసీ (కాకినాడ) సురేష్‌బాబు విచారణ జరిపారు. విచారణ నివేదికను త్వరలో కమిషనర్‌కు అందజేయనున్నట్లు తెలిసింది. 

* కనక మహాలక్ష్మి ఆలయంలో శాంతి నిర్ణయాలను తప్పుపడుతూ పాలక మండలి సభ్యులు గతంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఈమె ఇన్‌ఛార్జి ఈఓగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగడంతో పాలకమండలి అప్రమత్తమై ఆమెను ఎట్టి పరిస్థితిలో ఈఓగా నియమించవద్దని కోరుతూ లేఖ పంపారు. వైకాపా ముఖ్యనేతల దృష్టికి శాంతి వ్యవహార శైలిని తీసుకెళ్లడం గమనార్హం.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts