logo

మధ్య రోడ్డులో వెళ్తే.. రూ. 2000 జరిమానా

బీఆర్టీఎస్‌ మధ్య రోడ్డులో అనుమతి లేని వాహనాల రాకపోకలు నియంత్రించేలా ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్య రోడ్డులో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా అనుమతి లేకుండా ప్రయాణించే వాహన యజమానుల నుంచి రూ.2వేలు

Published : 23 Sep 2022 06:01 IST

బాజీకూడలిలో ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీ

ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే: బీఆర్టీఎస్‌ మధ్య రోడ్డులో అనుమతి లేని వాహనాల రాకపోకలు నియంత్రించేలా ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్య రోడ్డులో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇలా అనుమతి లేకుండా ప్రయాణించే వాహన యజమానుల నుంచి రూ.2వేలు జరిమానా వసూలు చేస్తామంటూ గోపాలపట్నం, ఎన్‌ఏడీకూడలి పరిసరాల్లో ఎక్కడికక్కడ హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేవలం బస్సులు, అత్యవసర వాహనాలకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉందన్నారు. అయితే ఈ మార్గంలో గ్యాస్‌పైపులైన్ల పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్‌ సమస్య తప్పడం లేదని వాహనచోదకులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపైనా దృష్టి సారించాలంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని