logo

స్వచ్ఛతలో.. ముందుకా.. వెనక్కా..!

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ర్యాంకులు ప్రకటించనున్న నేపథ్యంలో ఈనెల 30న దిల్లీ రావాలని మేయరు గొలగాని హరి వెంకట కుమారికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. అక్టోబరు 1న సర్వేక్షణ్‌ ర్యాంకులు ప్రదానం చేయనున్నారు.

Published : 25 Sep 2022 05:21 IST

మేయర్‌కు పిలుపు.. ర్యాంకుపై ఆశలు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ర్యాంకులు ప్రకటించనున్న నేపథ్యంలో ఈనెల 30న దిల్లీ రావాలని మేయరు గొలగాని హరి వెంకట కుమారికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ నుంచి ఆహ్వానం వచ్చింది. అక్టోబరు 1న సర్వేక్షణ్‌ ర్యాంకులు ప్రదానం చేయనున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ షహర్‌-సంవాద్‌’, ‘గార్బేజ్‌ ఫ్రీ సిటీ’పై జరిగే కార్యక్రమాలకు జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు, అదనపు కమిషనర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి కేఎస్‌ఎల్‌జి శాస్త్రి హాజరుకానున్నారు. వీరంతా ఈనెల 27న దిల్లీ వెళుతుండగా, మేయరు 30న బయలుదేరనున్నారు. 10 లక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖకు 10లోపు ర్యాంకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 9వ ర్యాంకు, సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌లో 2వ ర్యాంకు లభించింది. ఈసారి ప్రజాభిప్రాయ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. జీవీఎంసీ 4,49,759 మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా.. ద్వితీయ స్థానంలో దిల్లీ (4,19,977) ఉందని ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని