logo

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

సైబర్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ అన్నారు. విశాఖపట్నం ఛాంబర్‌ ఆఫ కామర్స్‌, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.

Published : 25 Sep 2022 05:21 IST

మాట్లాడుతున్న నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌

డాబాగార్డెన్స్‌, న్యూస్‌టుడే: సైబర్‌ దాడులపై అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌ అన్నారు. విశాఖపట్నం ఛాంబర్‌ ఆఫ కామర్స్‌, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ సైబర్‌ నేరాల నమోదులో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉంది. అందులో విశాఖ ముందు వరుసలో ఉందన్నారు. ఈ-మెయిల్‌, సామాజిక మాధ్యమాలు, నకిలీ రుణ యాప్‌ల ద్వారా మోసగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. అవగాహనతోనే వీటికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఈ మేరకు పోలీస్‌శాఖ పలు విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. ఛాంబర్‌ అధ్యక్షులు ఆర్‌.సతీష్‌, కార్యదర్శి విలియమ్స్‌, సమన్వయకర్త మోనిష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు