logo

సాగర జలాల్లో పోరు

తమ భూములు తీసుకున్న విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీరంలో శనివారం మత్స్యకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 25 Sep 2022 05:21 IST

కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద పడవలతో నిరసన తెలుపతున్న మత్స్యకారులు..

న్యూస్‌టుడే, జగదాంబ కూడలి: తమ భూములు తీసుకున్న విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తీరంలో శనివారం మత్స్యకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసన తెలపడానికి టెర్మినల్‌ వద్దకు బోట్లపై వెళ్లిన మత్స్యకారులపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలియగానే వేలాది మంది మత్స్యకారులు విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఈనెల 27న కలెక్టర్‌ చర్చలు జరిపి, న్యాయం చేస్తారని ఆర్డీఓ హుస్సేన్‌సాహెబ్‌ వచ్చి హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని