logo

ఆకట్టుకున్న శిలాజాల ప్రదర్శన

: విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఆచార్య కె.సమత అన్నారు. శనివారం ఉదయం ఏయూ జియాలజీ విభాగంలో ఏయూ, ఇంటాక్‌ విశాఖ సంయుక్తంగా అంతర్జాతీయ జియో డైవర్సిటీ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాజాల ప్రదర్శన ప్రారంభించి తిలకించారు.

Published : 25 Sep 2022 05:21 IST

ప్రదర్శనను తిలకిస్తున్న విద్యార్థులు, ఆచార్యులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : విద్యార్థులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఆంధ్ర విశ్వవిద్యాలయం రెక్టార్‌ ఆచార్య కె.సమత అన్నారు. శనివారం ఉదయం ఏయూ జియాలజీ విభాగంలో ఏయూ, ఇంటాక్‌ విశాఖ సంయుక్తంగా అంతర్జాతీయ జియో డైవర్సిటీ దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన శిలాజాల ప్రదర్శన ప్రారంభించి తిలకించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నూతన ఆలోచనలను, సమున్నత ఆశయాలను కలిగించే విధంగా ఇటువంటి ప్రదర్శనలు నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య కె.శ్రీనివాసరావు, ఇంటాక్‌ విశాఖ కన్వీనర్‌ డాక్టర్‌ డి.రాజశేఖరరెడ్డి, జియాలజీ విభాగాధిపతి ఆచార్య కె.సత్యనారాయణ రెడ్డి, ఆచార్య ఇ.ఎన్‌.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని