logo

సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌, రెవెన్యూ సర్వీసుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఉత్తరాంధ్రలోని ఆరు

Published : 26 Sep 2022 05:22 IST

రెవెన్యూ సర్వీసుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు


ప్రమాణ స్వీకారం చేస్తున్న అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు

శ్రీకాకుళం, న్యూస్‌టుడే:  రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌, రెవెన్యూ సర్వీసుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాల ఎన్నిక శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించారు.  మూడేళ్లుగా బదిలీలు లేకపోవడంతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి జాబ్‌ఛార్ట్‌ ప్రకారం విధులు కేటాయించి పనిఒత్తిడి తగ్గించాలన్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే పోరాటాలు చేయక తప్పదన్నారు. ప్రభుత్వంతో పాత పింఛను విధానంపై మాత్రమే చర్చలకు వస్తామని, జీపీఎస్‌ అక్కర్లేదన్నారు. వివిధ సమస్య పరిష్కారానికి ఉద్యమాలను చేపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. వివిధ జిల్లాల జేఏసీ ఛైర్మన్లు కె.శ్రీరాములు, ఎస్‌.నాగేశ్వరరెడ్డి, రమణరాజు, రెవెన్యూ సర్వీసుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వేణుగోపాల్‌, రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసరావు, ఏపీ వీఆర్‌వోల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇ.శ్రీరామమూర్తి, రెవెన్యూ సర్వీసుల సంఘ జిల్లా కార్యదర్శి బి.వి.వి.ఎన్‌.రాజు, వీఆర్‌వోల సంఘ జిల్లా అధ్యక్షుడు వై.అప్పలస్వామి, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అడహాక్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌.గోవిందరావు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లాల వారీగా ఏకగ్రీవంగా జరిగింది. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎల్‌.దిలీప్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా పి.వరప్రాసాద్‌, కార్యదర్శిగా పి.సురేష్‌, సంయుక్త కార్యదర్శిగా కె.వెంకటేష్‌, కోశాధికారిగా కె.జ్యోతితో పాటు నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

* విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా కె.సురేష్‌కుమార్‌, ఉపాధ్యక్షుడుగా ఎస్‌.చైతన్యకుమార్‌, కార్యదర్శిగా జె.కృష్ణంనాయుడు, సంయుక్త కార్యదర్శిగా ఇ.సాగర్‌, కోశాధికారిగా బి.శైలజతో పాటు నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

* అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ఎల్‌.చిరంజీవి, ఉపాధ్యక్షుడిగా ఎస్‌.బాలకృష్ణ, కార్యదర్శిగా ఎస్‌.లక్ష్మణదాస్‌, సంయుక్త కార్యదర్శిగా సీతారాం, కోశాధికారిగా ఆజాద్‌తోపాటు నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని