logo

Vangalapudi Anitha: లోటస్‌పాండ్‌కు వైఎస్‌ పేరు ఎందుకు పెట్టలేదు?: అనిత

సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైకాపా దొంగల ముఠా కొత్త ఎత్తుగడ వేసిందని, ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు.

Updated : 26 Sep 2022 09:38 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం స్కామ్‌ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైకాపా దొంగల ముఠా కొత్త ఎత్తుగడ వేసిందని, ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యం స్కామ్‌లో సీఎం జగన్‌ భార్య భారతిరెడ్డితో పాటు వైకాపా ముఖ్యనాయకుల పాత్ర ఉందని, వైకాపా నాయకులు, అనుచరుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఆయా అంశాలను కప్పిపుచ్చడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ కుతంత్రానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌ తన తాడేపల్లి ప్యాలెస్‌, లోటస్‌పాండ్‌ నివాసాలకు వైఎస్‌ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్ర చూసి వైకాపా నేతలు భయపడుతున్నారని, ఎప్పుడూ లేనిది ఇప్పుడు విశాఖలో వికేంద్రీకరణ పేరుతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఎందుకు పెట్టారని నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో వైకాపా నాయకులు విశాఖలో కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని