logo

వచ్చే నెలలో ప్రసాద్‌ పథకం పనులు

సింహాచలం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రసాద్‌ పథకం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తయిందన్నారు.

Published : 26 Sep 2022 05:22 IST

కప్పస్తంభం వద్ద పూజలు చేస్తున్న రోజా

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్రసాద్‌ పథకం పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే డీపీఆర్‌ పూర్తయిందన్నారు. పీపీపీ మోడల్‌ జీవో రాగానే రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఆదివారం సింహాచలం అప్పన్న స్వామిని ఆమె దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్‌ స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

* అయిదేళ్లు అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు రాజధాని ఎందుకు నిర్మించలేదని మంత్రి ప్రశ్నించారు. విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయని ట్వీట్ చేసిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. నిజంగా ఎవరికి విశ్వాసం లేదో గుర్తు చేసుకోవాలని, ఎన్టీఆర్‌ నుంచి పదవిని లాక్కున్న చంద్రబాబుకు తొత్తులుగా మారారంటూ బాలకృష్ణ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని