logo

డ్రైవింగ్‌ రాకున్నా లైసెన్సులు వచ్చేస్తున్నాయ్‌

నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. సరదా కోసమని విన్యాసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పోలీసు

Published : 26 Sep 2022 05:26 IST

యువతులు కూడా నిబంధనలు పాటించటం లేదు
నగర సీపీ శ్రీకాంత్‌ ఆవేదన


సమావేశంలో మాట్లాడుతున్న సీపీ శ్రీకాంత్‌

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే: నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. సరదా కోసమని విన్యాసాలు చేసి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని నగర పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం పోలీసు మైదానంలో ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రమాదాల వల్ల కుమారుడు మృతిచెందితే ఆ కుటుంబ వేదన వర్ణణాతీతమని.. అంగవైకల్యం ఏర్పడితే ఆ బాధ జీవితాంతం ఉంటుందన్నారు. నగర పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 258 మంది చనిపోతే, 977 మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు. ఈ ఏడాది నగరంలో 26 మంది హత్యల కారణంగా చనిపోతే, 258 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోవటం అంటే పదింతలు ఎక్కువని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల మృతుల్లో 93 శాతం మంది ద్విచక్రవాహనదారులేనని పేర్కొన్నారు. యువతులు కూడా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల్లో అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే లైసెన్స్‌ జారీ చేస్తారని.. ఇక్కడ మాత్రం డ్రైవింగ్‌ రాకున్నా లైసెన్స్‌లు వస్తున్నాయన్నారు. ప్రమాదాలను నియంత్రించేందుకు భారీ వాహనాలను రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించామన్నారు. ఈ విషయంలో తనపై తీవ్రంగా ఒత్తిడి వస్తున్నా ప్రాణాలు కాపాడటం ముఖ్యమని భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఏడీసీపీ(ట్రాఫిక్‌) ఆరీఫుల్లా, ఏడీసీపీ(క్రైమ్‌) గంగాధరం, ఏడీసీపీ(పరిపాలన) ఎంఆర్‌కె రాజు, ట్రాఫిక్‌ ఏసీపీలు, సి.ఐ.లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని