logo

‘వికేంద్రీకరణతోనే సర్వతోముఖాభివృద్ధి’

వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా గురువారం మండల కేంద్రం రోలుగుంటలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సహకార సంఘం కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ మండల

Published : 30 Sep 2022 03:57 IST

ర్యాలీలో ధర్మశ్రీ, వైకాపా నాయకులు

రోలుగుంట, న్యూస్‌టుడే: వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా గురువారం మండల కేంద్రం రోలుగుంటలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సహకార సంఘం కార్యాలయం నుంచి మొదలైన ఈ ర్యాలీ మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణం వరకూ సాగింది. వర్షంలో సైతం ర్యాలీ కొనసాగించారు. అంతకుముందు నిండుగొండలో గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రూ.3 లక్షల కోట్ల ఆదాయం సాధించగల సత్తా హైదరాబాద్‌ తరవాత విశాఖకే ఉందన్నారు. తద్వారా రాష్ట్రంలోని మిగతా జిల్లాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశముందని పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో సంఘీభావ ర్యాలీలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 88 శాతం సంతృప్తికరమైన పరిపాలన అందించామన్నారు. కార్యక్రమంలో సర్పంచి శెట్టి సంధ్య, వెంకట రాజారావు, మాజీ ఎంపీపీ సత్యనారాయణమూర్తి, పార్టీ అధ్యక్షులు మడ్డు అప్పలనాయుడు, నాయకులు చెట్టుపల్లి వెంకటరావు, టి.వి.రమణ, గొర్లె రామన్‌, పోతల శ్రీనివాసరావు, ఉలబాల రాము, హరిబాబు, శెట్టి లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని