logo

చేయూతతో ఆర్థిక భరోసా

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు సాధికారత సాధించేందుకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కె.కోటపాడు మండల కేంద్రంలో గురువారం పొదుపు సంఘాల మహిళలతో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. ఎంపీ బీవీ సత్యవతితో

Published : 30 Sep 2022 03:57 IST

వైఎస్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి తదితరులు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు సాధికారత సాధించేందుకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. కె.కోటపాడు మండల కేంద్రంలో గురువారం పొదుపు సంఘాల మహిళలతో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. ఎంపీ బీవీ సత్యవతితో కలిసి రూ.9.16 కోట్ల నమూనా చెక్కు అందజేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు కె.కోటపాడులోనే చేయూత పథకం ద్వారా మహిళలందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సభ ప్రారంభానికి ముందు జ్యోతిప్రజ్వలన చేసి వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేశారు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, జడ్పీటీసీ సభ్యురాలు అనూరాధ, సర్పంచి అరుణ, ఎంపీడీఓ శచీదేవి, తహసీల్దారు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు