logo

బాలలపై లైంగిక దాడులను అరికట్టాలి

సమాజంలో నానాటికీ బాలలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవా సదన్‌లో ‘పోక్సో చట్టం-పరిహారాలు’ అనే అంశంపై గురువారం జరిగిన న్యాయ అవగాహనా సదస్సులో ఆమె

Published : 30 Sep 2022 03:57 IST

ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి, చిత్రంలో డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ హర్షిత,

న్యాయమూర్తి బులికృష్ణ తదితరులు

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: సమాజంలో నానాటికీ బాలలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయసేవా సదన్‌లో ‘పోక్సో చట్టం-పరిహారాలు’ అనే అంశంపై గురువారం జరిగిన న్యాయ అవగాహనా సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పిల్లలను బాధ్యతగా పెంచటంతోపాటు, వారి చుట్టూ ఉన్న సమాజం కదలికలను గమనిస్తూ ఉండాలని బాలల తల్లిదండ్రులను కోరారు. అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ హర్షిత మాట్లాడుతూ నేరాల నియంత్రణ మెలకువలు తెలిపారు. జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.కె.వి.బులికృష్ణ, జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎం.శరత్‌బాబు, లోక్‌అదాలత్‌ సీనియర్‌ సభ్యులు ఆర్‌.శ్రీనివాసరావు, బి.తులసీదాస్‌ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts