logo

దరఖాస్తుల పరిశీలన సత్వరమే పూర్తిచేయాలి

పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్‌ మీనా అన్నారు. గురువారం సాయంత్రం అమరావతి

Published : 30 Sep 2022 03:57 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముఖేష్‌కుమార్‌ మీనా అన్నారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి నిర్వహించిన వీసీలో ఆయన మాట్ల్లాడారు. జిల్లాలో అర్హులైన వారి పేర్లు నవంబరు 7వ తేదీలోపు నమోదు చేయాలన్నారు. శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండవల్సిన ఓటర్ల శాతం 75కంటే ఎక్కువగా ఉంటే ఓటర్ల వివరాలను మరోసారి క్షుణ్నంగా పరిశీలన చేయాలన్నారు. తక్కువ ఓటర్లు నమోదైన చోట పునఃపరిశీలన జరగాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఓటర్ల మార్పు,చేర్పుల కోసం గరుడ్‌ యాప్‌ను ఇవ్వడం జరిగిందన్నారు. అక్టోబరు 1 నుంచి నమోదులు ఆరంభం కావాలన్నారు. దరఖాస్తులను బీఎల్‌ఓల ద్వారా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనరాదని, వారు పాల్గొన్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే విచారణ జరిపి చర్యలను చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని చెప్పారు. వీసీలో జేసీ విశ్వనాథన్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి, బీమిలి ఆర్డీఓ భాస్కర్‌రెడ్డి, ఎన్నికల అధికారులు, డీటీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని