logo

వంశధార నదిలో విద్యార్థి గల్లంతు

దసరా సెలవులకు తాతగారింటికి వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తూ వంశధార నదిలో పడి గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

Published : 30 Sep 2022 03:57 IST

గార, న్యూస్‌టుడే: దసరా సెలవులకు తాతగారింటికి వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తూ వంశధార నదిలో పడి గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని కొత్త గాజువాక హైస్కూలు రోడ్డు ప్రాంతానికి చెందిన టోకూరు కార్తీక్‌ (9) తల్లి లక్ష్మి, అక్క లోకితతో కలిసి గార మండలం తూలుగు పంచాయతీ కొయ్యానపేటలోని తాతగారింటికి రెండు రోజుల కిందట వచ్చారు. చిన్నాన్న దేవరాజ్‌ వ్యాను శుభ్రం చేసుకునేందుకు గురువారం నది వద్దకు వెళ్తుండగా కార్తిక్‌, లోకిత వెళ్లారు. దేవరాజ్‌ వాహనం కడుగుతుండగా కార్తీక్‌ నదిలోకి దిగాడు. ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా రాత్రివరకూ ఆచూకీ తెలియలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని