logo

చెల్లించిన వేతనాలు వసూలు చేయండి

విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థలో పలువురు ఉద్యోగులకు చెల్లించిన వేతనాలు తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. దీంతో

Published : 30 Sep 2022 03:57 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థలో పలువురు ఉద్యోగులకు చెల్లించిన వేతనాలు తిరిగి వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైకాపా ప్రభుత్వం ఉద్యోగుల విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. దీంతో పలు శాఖల్లో 60 ఏళ్లు నిండిన వారు మరో రెండేళ్లు కొనసాగే అవకాశం వచ్చింది. అయితే... ప్రభుత్వం కొన్ని అనుబంధ సంస్థల్లో ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం చేసింది. అయినా పలువురు రెండేళ్లపాటు కొనసాగొచ్చని, తమకూ ప్రభుత్వం అవకాశం ఇస్తుందని భావించారు. కొన్నినెలలుగా అధికారులు సైతం వేతనాలు చెల్లిస్తూ వచ్చారు.

  ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 12 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు వారికి చెల్లించిన వేతనాలను తిరిగి వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కసరత్తు అకౌంటింగ్‌ విభాగం ప్రారంభించింది.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని