logo

రిజిస్ట్రేషన్ల శాఖలో.. కార్పొరేట్‌ తరహా కార్యాలయం!

అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్‌ తరహాలో ఒక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగా పరిశీలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ)రామకృష్ణ గురువారం విశాఖలో

Published : 30 Sep 2022 03:57 IST

ఐజీ రహస్య పర్యటన

ఈనాడు, విశాఖపట్నం: అధునాతన సౌకర్యాలతో కార్పొరేట్‌ తరహాలో ఒక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఈ దిశగా పరిశీలనకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ)రామకృష్ణ గురువారం విశాఖలో పర్యటించారు. నగరంలోని ఏదైనా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తారని మొదట భావించారు. సమయం కుదరకపోవడంతో ఎక్కడికీ వెళ్లలేదు. ఐటీ హిల్స్‌, మధురవాడ, ఇతర ప్రాంతాలను ఆయన పరిశీలించినట్లు తెలిసింది. కార్పొరేట్‌ తరహా కార్యాలయానికి 20 వేల చదరపు అడుగుల భవనాన్ని చూస్తున్నట్లు సమాచారం. ఐజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన మొదటిసారి విశాఖకు వచ్చారు. అయినప్పటికీ పర్యటనను రహస్యంగా ఉంచడం గమనార్హం. తప్పుడు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశాలపైనా ఐజీ ఆరాతీసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని