logo

ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం మొదలైంది. కీలకమైన ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ అక్టోబరు 1వ తేదీ(శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల్లో కలెక్టర్లు శనివారం ఉదయం ఓటరు నమోదు రిజిస్ట్రేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Published : 01 Oct 2022 03:47 IST

ఓటర్ల నమోదుకు నేటి నుంచి శ్రీకారం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోలాహలం మొదలైంది. కీలకమైన ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ అక్టోబరు 1వ తేదీ(శనివారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర పరిధిలోని ఆరు జిల్లాల్లో కలెక్టర్లు శనివారం ఉదయం ఓటరు నమోదు రిజిస్ట్రేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జోనల్‌ కమిషనర్‌ (జీవీఎంసీ పరిధిలో) కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటరు నమోదుకు వినియోగించే ‘ఫారం 18’ సీఈఓ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జిల్లా యంత్రాంగం తరఫున 3 లక్షల వరకు ‘ఫారం 18’లను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా విశాఖ డీఆర్వో వ్యవహరిస్తారు. మిగిలిన జిల్లాల డీఆర్వోలు అదనపు రిజిస్ట్రేషన్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. నవంబరు 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

* ఇంటి చిరునామా, 2019 అక్టోబరు 31 నాటికి డిగ్రీ పూర్తి చేసినట్లు గెజిటెడ్‌ అధికారులు ధ్రువీకరించిన డిగ్రీ మార్కుల జాబితా జిరాక్సు కాపీలను దరఖాస్తుకు జతచేయాలి. పాస్‌పోర్ట్‌ సైజ్‌ కలర్‌ఫొటో అందజేయాలి. దరఖాస్తులో ఆధార్‌ సంఖ్యను నమోదు చేయాలి. ఏక మొత్తంలో(బల్క్‌గా) దరఖాస్తులు స్వీకరించబోరు. ఒకే చిరునామాలో నలుగురైదుగురు ఉంటే అవన్నీ ఒకరు అందజేయవచ్చు. ఆన్‌లైన్‌లో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. బీ ఇప్పటికే అధికార వైకాపా తమ అభ్యర్థిగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ను ప్రకటించింది. వామపక్షాలు, వాటికి అనుబంధంగా ఉన్న 250 సంఘాలు కలిపి తమ అభ్యర్థిగా కె.రమాప్రభ పేరును ప్రకటించాయి. తెదేపా ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. భాజపా తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. రాజకీయపక్షాలు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని