logo

‘సవాళ్లను అధిగమిస్తూ.. అభివృద్థి పథంలో’

ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, సంస్థ అభివృద్ధి దిశలో పయనించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని హిందుస్థాన్‌ షిప్‌యార్డు సీఎండీ హేమంత్‌ఖత్రీ అన్నారు. గురువారం సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 01 Oct 2022 03:47 IST

కార్యక్రమంలో షిప్‌యార్డు సీఎండీ హేమంత్‌ఖత్రీ, అధికారులు

సింధియా, న్యూస్‌టుడే: ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, సంస్థ అభివృద్ధి దిశలో పయనించేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామని హిందుస్థాన్‌ షిప్‌యార్డు సీఎండీ హేమంత్‌ఖత్రీ అన్నారు. గురువారం సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌ నేవీకి చెందిన రెండు డైవింగ్‌ సపోర్టు వెసల్స్‌ను ఒకే రోజు ఫ్లోట్‌ చేయడంలో, రానున్న కాలంలో నిర్మించే రక్షణ ఉత్పత్తుల్లో ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. 2021-22లో రూ. 755 కోట్ల ఉత్పత్తి విలువ సాధించామన్నారు. భవిష్యత్తులో రూ. వెయ్యికోట్లకు చేరుతామన్నారు. గతంలో క్రేన్‌ ప్రమాద ఘటనకు డిజైన్‌ వైఫల్యమే కారణమని మూడు నివేదికలు  నిర్ధారించాయన్నారు. సంస్థలో ఎల్‌ అండ్‌ ఎం సిరీస్‌ ఉద్యోగులకు అక్టోబర్‌ ఒకటో తేదీన ఇంక్రిమెంట్‌ ఇవ్వడంతో పాటు, ఇతర సంక్షేమ సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.  అనంతరం ఆయన అధికారులతో కలిసి సంస్థ ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన గీతాన్ని ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని