logo

కోడూరులో ఆటోనగర్‌ ఏర్పాటు

పరిశ్రమలకు కొత్త జిల్లా అనుకూలంగా ఉందని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. అక్టోబరు 9న కోడూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. శుక్రవారం ఎంఎస్‌ఎంఈ జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 01 Oct 2022 03:47 IST

9న శంకుస్థాపన : మంత్రి అమర్‌నాథ్‌

సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి అమర్‌'

అనకాపల్లి పట్టణం, నెహ్రూచౌక్‌, న్యూస్‌టుడే: పరిశ్రమలకు కొత్త జిల్లా అనుకూలంగా ఉందని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. అక్టోబరు 9న కోడూరులో ఆటోనగర్‌ ఏర్పాటుకి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. శుక్రవారం ఎంఎస్‌ఎంఈ జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ అనకాపల్లి నుంచే పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు నాంది పలుకుతున్నామన్నారు. జిల్లాలోని ప్రాంతాల వారీగా ప్రాధాన్యాన్ని బట్టి పరిశ్రమలను ప్రోత్సహించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎంపీ డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ ప్రతి ఉత్పత్తినీ స్వదేశంలోనే తయారుచేసేలా యువత ఎదగాలని ఆకాంక్షించారు. ఎంఎస్‌ఎంఈ పోర్టల్‌లో యువత తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎంఎస్‌ఎంఈ ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సమగ్రంగా వివరించారని గుర్తుచేశారు. మహిళల కోసం అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రిని కోరామన్నారు. కొందరు పరిశ్రమలు నిర్వాహకులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్తు ప్రధాన సమస్యగా ఉందని, రాయితీలు అనుకున్న సమయానికి రావడం లేదన్నారు. అచ్యుతాపురంలోని ఏపీఐఐసీకి కేటాయించిన భూములను దరఖాస్తు చేసుకున్న వారికి అప్పగించలేదన్నారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ సమగ్ర సమాచారం సేకరించి సమస్యల పరిష్కరించేలా చూస్తామన్నారు. సదస్సులో ఎంఎస్‌ఎంఈ అదనపు డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌, ఎంఎస్‌ఎంఈ జిల్లా ఏడీ నాయుడు, సభ్యులు పురుషోత్తం, విశాఖపట్నం ఆటోనగర్‌ గౌరవాధ్యక్షులు ఏకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని