logo

వేచి ఉండడమే అసలు ‘పరీక్ష’

విధి వారిని వెక్కిరించింది. ఏదో ఒక వైకల్యంతో వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వం అందించే పింఛను, ఇతర ఆర్థిక తోడ్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి వైకల్య ధ్రువీకరణ పత్రం అవసరం.

Published : 01 Oct 2022 03:47 IST

ఎముకల వైద్య నిపుణుడి గది ముందు దివ్యాంగులు, సహాయకులు

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: విధి వారిని వెక్కిరించింది. ఏదో ఒక వైకల్యంతో వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వం అందించే పింఛను, ఇతర ఆర్థిక తోడ్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారికి వైకల్య ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ప్రతి శుక్రవారం నర్సీపట్నం, చోడవరం, కొయ్యూరు తదితర ప్రాంతాల నుంచి 70, 80 మంది దివ్యాంగులు, సహాయకులతో కలిసి వస్తుంటారు. వీరంతా వేచి ఉండే 11వ నంబరు గది ముందు పది మందికే కుర్చీలున్నాయి. వీటిలో  మూడు మరమ్మతుకు గురయ్యాయి. చాలామంది తమవంతు వచ్చే వరకు నిలబడాల్సి వస్తోంది. అవసరమైన బల్లలు, ఆసుపత్రి బయట వీల్‌ఛైర్లు అందుబాటులో ఉంచాలని వారంతా కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని