logo

విద్య, వైద్య రంగానికి పెద్దపీట : మంత్రి రజిని

రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం ఆమె పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన నాలుగు వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు.

Updated : 02 Oct 2022 05:11 IST

క్రాంతినగర్‌లో మాట్లాడుతున్న మంత్రి రజిని

మల్కాపురం, సింధియా, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం ఆమె పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించిన నాలుగు వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం క్రాంతినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 528 పట్ణణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1125 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, పీజీ, మెడికల్‌ కళాశాలలకు సుమారు రూ.16 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఆరోగ్య కేంద్రాల పనితీరుపై నిత్యం సమీక్షిస్తూ, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పశ్చిమ వైకాపా ఇంఛార్జి ఆడారి ఆనంద్‌కుమార్‌, ఉపమేయర్‌ జియ్యాని శ్రీధర్‌, కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని