logo

స్వచ్ఛతలో జీవీఎంసీ మెరుపులు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు కైవసం చేసుకుంది. దేశంలోని 1845 నగరాలతో పోటీపడిన విశాఖ గార్బేజ్‌ ఫ్రీ సిటీ కేటగిరిలో ఇప్పటికే ప్రథమ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే.

Published : 02 Oct 2022 04:46 IST

జాతీయ స్థాయిలో  4వ ర్యాంకు కైవసం


కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌పురి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న మేయరు హరి వెంకట కుమారి, చిత్రంలో కమిషనర్‌ రాజాబాబు, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ లక్ష్మీశ

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు కైవసం చేసుకుంది. దేశంలోని 1845 నగరాలతో పోటీపడిన విశాఖ గార్బేజ్‌ ఫ్రీ సిటీ కేటగిరిలో ఇప్పటికే ప్రథమ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ర్యాంకులను ప్రకటించారు. మొత్తం 7,500 మార్కులకు జీవీఎంసీ 6,701 మార్కులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇండోర్‌ 7,146, సూరత్‌ 6,925, నవీ ముంబై 6,853 మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. పారిశుద్ధ్యంలో 3వేల మార్కులకు జీవీఎంసీ 2536 సాధించింది. చెత్త రహిత స్థానిక సంస్థ విభాగంలో 1250 మార్కులకు 1050 సాధించింది. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌పురి చేతుల మీదుగా మేయరు గొలగాని హరి వెంకట కుమారి, కమిషనర్‌ పి.రాజాబాబు, ఏపీయూఎఫ్‌ఐడీసీ ఎండీ జి.లక్ష్మీశ అవార్డు, జ్ఞాపికలు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని