logo

‘రాష్ట్రంలో అరాచక పాలన’

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించినందుకు నిరసనగా శనివారం తహసీల్దారు కార్యాలయం ఎదుట స్థానిక నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు.

Published : 02 Oct 2022 04:46 IST

నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా, మాజీ ఎమ్మెల్యే రాజు, తాతయ్యబాబు, మల్లునాయుడు తదితరులు

చోడవరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరును తొలగించినందుకు నిరసనగా శనివారం తహసీల్దారు కార్యాలయం ఎదుట స్థానిక నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. డీసీసీబీలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. డీసీసీబీ వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని గత నెల 20న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, ఇప్పటికే పది రోజులు దాటినా ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి అన్ని పీఏసీఎస్‌ల ఎదుట ధర్నా చేస్తామన్నారు. జిల్లాకు ఇద్దరు మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పేరును మాత్రమే అధికార పార్టీ తొలగించిందని, ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మమకారాన్ని వీరేమీ చేయలేరన్నారు. దీక్షలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లునాయుడు, పెదబాబు, వెంకటరమణ, వెంకట అప్పారావు, కోటేశ్వరరావు, శ్రీను, చిన్న పాల్గొన్నారు.

‘తెదేపా నేతల జోలికి వస్తే జగన్‌ జైలుకే’

ఎలమంచిలి: తెదేపా నాయకుల జోలికి వస్తే జగన్‌ జైలుకి వెళ్లక తప్పదని తెదేపా సీనియర్‌ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు హెచ్చరించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌ ఇంటిపై సీఐడీ పోలీసులు దాడికి నిరసనగా శనివారం రాత్రి ఎలమంచిలిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కాగడాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన చలపతిరావు మాట్లాడుతూ తెదేపా నాయకులపై కక్షతో ప్రభుత్వం ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు.  తెదేపా నాయకులు ఆడారి ఆదిమూర్తి, ఆడారి రమణబాబు, కొఠారు సాంబ, కౌన్సిలర్‌ మజ్జి రామకృష్ణ, గొర్లె నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని